Neeti Vagula Koraku | Telugu Song

“Neeti Vagula Koraku” is a beautiful Christian devotional song that reflects the deep longing of the soul for God’s presence. This hymn beautifully captures the essence of praising the Lord for His guidance, protection, and unconditional love. Explore the full lyrics below to worship and meditate on His goodness.

Listen to Audio / పాట వినండి:

నీటి వాగుల కొరకు
దుప్పి ఆశించునట్లు
నీ కొరకు నా ప్రాణము
దప్పిగొనుచున్నది ||2||
నా ప్రాణమా నా సమస్తమా
ప్రభుని స్తుతియించుమా
నా యేసు చేసిన మేళ్లను
నీవు మరువకుమా ||2||
నా ప్రాణమా నా సమస్తమా

పనికిరాని నను నీవు
పైకి లేపితివి
క్రీస్తనే బండపైన
నన్ను నిలిపితివి ||2||
నా అడుగులు స్థిరపరచి
బలము నిచ్చితివి
నీదు అడుగు జాడలనే
వెంబడింతు ప్రభు
నే వెంబడింతు ప్రభు ॥ నా ప్రాణమా ॥

అంధకారపు లోయలలో
నేను నడచితిని
ఏ అపాయము రాకుండా
నన్ను నడిపితివి ||2||
కంటి పాపగ నీవు
నన్ను కాచితివి
కన్నతండ్రివి నీవని
నిన్ను కొలచెదను
ఇలలో నిన్ను కొలచెదను ॥ నా ప్రాణమా ॥

నీదు ఆత్మతో నిండుగా
నన్ను నింపు ప్రభు
ఆత్మా ఫలములు దండిగా
నీకై ఫలియింతును ||2||
నీవు చేసిన మేళ్లను
నేనెట్లు మరతు ప్రభు
నీ కొరకు నే సాక్షిగ
ఇలలో జీవింతును
నే ఇలలో జీవింతును ॥ నా ప్రాణమా ॥

Neeti vagula koraku
Duppi aashinchunatlu
Nee koraku naa praanamu
Dappigonuchunnadi ||2||
Naa praanamaa naa samastamaa
Prabhuni sthuthiyinchumaa
Naa Yesuu chesina mellanu
Neevu maruvakumaa ||2||
Naa praanamaa naa samastamaa

Panikiraani nanu neevu
Paiki lepitivi
Kreesthane bandapaina
Nannu nilipitivi ||2||
Naa adugulu sthiraparachi
Balamu nichitivi
Needu adugu jaadalane
Vembadinthu prabhu
Ne vembadinthu prabhu || Naa praanamaa ||

Andhakaarapu loyalalo
Nenu nadachitini
Ee apaayamu raakunda
Nannu nadipitivi ||2||
Kanti paapaga neevu
Nannu kaachitivi
Kannathandrivi neevani
Ninnu kolachedanu
Ilalo ninnu kolachedanu || Naa praanamaa ||

Needu aathmatho nindugaa
Nannu nimpu prabhu
Aathma phalamulu dandigaa
Neekai phaliyinthunu ||2||
Neevu chesina mellanu
Nenetlu marathu prabhu
Nee koraku ne saakshigaa
Ilalo jeevinthunu
Ne ilalo jeevinthunu || Naa praanamaa ||

Neeti Vagula Koraku Lyrics

Neeti Vagula Koraku watch on YouTube

Check more Telugu Christian Songs lyrics here and Follow us on Instagram for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top